రాజకీయాల్లో మార్పు తెచ్చింది ఎన్టీఆర్
రాజకీయాల్లో మార్పు తెచ్చింది ఎన్టీఆర్
రాప్తాడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాప్తాడు, ఆంధ్రప్రభ : దేశ రాజకీయాల్లోనే కొత్త మార్పును తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంను నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా గౌరవంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. 50 కేజీల కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు పంపిణీ చేశారు.
అలాగే టీడీపీ కుటుంబ సభ్యులందరికి ఎమ్మెల్యే సునీత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిటాల రవీంద్రను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు తీసుకొని సమర్థవంతంగా పార్టీని నడిపిస్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు.1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులకు అలాగే ప్రస్తుతం కీలకంగా ఉన్న పార్టీ నాయకులు 40 మందికి ఘనంగా సన్మానం చేశారు.

5 మండలాలు, నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో మొత్తం 500 మంది వరకు నాయకులకు శాలువాలు పూలమాలలతో సత్కరించారు. అందరితో కలిసి పార్టీ కోసం తమవంతుగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. భవిష్యత్తులో టిడిపి పార్టీని జాతీయస్థాయిలో బలపడే విధంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అనంతరం సీనియర్ నాయకులకు భోజనం వడ్డించి వాళ్ళతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శ్రీనివాసులు పిఎసిఎస్ చైర్మన్ గోపాల్ నాయుడు సర్పంచులు నరేష్ తిరుపాలు సీనయ్య క్లస్టర్ ఇంచార్జ్ లు నారాయణ స్వామి సిసి రాము మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి లక్ష్మీనారాయణ ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య రామినేపల్లి లక్ష్మన్న మాజీ కన్వీనర్ నారాయణస్వామి గంగలకుంట రమణ ఎన్టీఆర్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
