కార్మికులకు అండ.. ఎర్రజెండానే..

కార్మికులకు అండ.. ఎర్రజెండానే..
రాప్తాడు, ఆంధ్రప్రభ : యుద్ధం వద్దు ప్రపంచ శాంతి కావాలి అని కార్మిక వర్గం నినదించాలని వామపక్ష పార్టీ నాయకులు సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజనేయులు సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ పేర్కొన్నారు.రాప్తాడు మండలంలోని పంచాయితీ కార్మికులు హమాలీలు వివిధ గ్రామాల నుండి వచ్చిన పంచాయతీ కార్మికులతో మండల కేంద్రం నందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముందుగా వామపక్ష పార్టీ నాయకులు సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజనేయులు సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వామపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ 8 గంటల పని దినం అమలు చేయాలనీ పనికి తగిన ప్రతి ఫలం ఇవ్వాలనీ పని స్థలాల్లో మెరుగైన పరిస్థితులు కావాలనీ పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన రోజు మే డే అని తెలిపారు.
1886 లో మే 1న చికాగో లోని హే మార్కెట్ వద్ద జరిగిన ఆందోళనపై పోలీసులు విరుచుకుపడడంతో 8 మంది కార్మిక నాయకులు మరణించారు.ఆ రోజుకు గుర్తుగా ప్రతి ఏడాదీ మే మొదటి తేదీన ప్రపంచం లోని కార్మికులు అంతా మే డే జరుపుకుంటున్నారు. ఆ పోరాట ఫలితమే ప్రపంచ వ్యాప్తంగా నేడు 8 గంటల పని దినం అమలు అవుతున్నది.ఆ పోరాట స్ఫూర్తిని తీసుకుని నేడు కార్మిక వర్గంపై ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న పని భారానికీ పని గంటల పెంపుకీ శ్రమ దోపీడీకీ వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. మనదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
కార్మికులపై మరింత పని భారాన్ని పెంచుతూ ప్రశ్నించే హక్కును నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తున్న సంధర్భంలో భారతదేశ కార్మిక వర్గం ఐక్యమై 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసే వరకు పోరాడదామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శిలు ఆర్.రవీంద్ర పోతలయ్య సహాయక కార్యదర్శి చలపతి సిఐటియు మండల కార్యదర్శి బ్రహ్మయ్య శాఖా కార్యదర్శి ప్రసాద్ శేషమ్మ తులసమ్మ హరీష్ పెద్దన్న రామాంజనేయులు మేస్త్రి మల్లేష్ సుబ్బారావు లక్ష్మన్న హమాలీలు మధు ప్రతాప్ కుమార్ నాగేష్ ఎస్.నారాయణస్వామి అమర్నాథ్ మధు కుమార్ పోతలయ్య మధు ప్రసాద్ పంచాయతీ కార్మికులు కదిరయ్య లక్ష్మీదేవి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
