గోవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీవారు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా హోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు గోవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం నిర్వహించి, వివిధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ దాతలు బళ్లారి బండి మోటు, సూరా లక్ష్మపతి శెట్టి అండ్ సన్స్ (కృష్ణమూర్తి, బాలరాజు, విశ్వనాథ్), ఉరవకొండ సూరా వెంకట చలపతయ్య శెట్టి అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, భజా భజంత్రీల నడుమ దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు.

తరువాత గోవాహనంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి, మాడవీధులలో శోభాయాత్రగా తీసుకెళ్లారు. స్వామివారి దర్శనార్థం కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, అర్చకులు మయూరం బాలాజీ చార్యులు, గుండురావు, బొల్లినేని పద్మాక్షి, దబ్బర మాధవి, బోయ రాములమ్మ, కురుబ ఇందిరమ్మ, బోయ ఎర్రమ్మ, చావలి బాయి, మీనుగ రామకృష్ణ, ధనంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, మంగళ చిన్న నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.
