రైతుల ధాన్యం త్వరగా తరలించాలి

రైతుల ధాన్యం త్వరగా తరలించాలి

జిల్లా చైర్మన్ మారుజోడు రాంబాబు

రఘునాథపల్లి ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ధాన్యాన్ని త్వరితగతిన తరలించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచనల మేరకు శనివారం రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, సీఐ, ఎస్ఐ, ఐకేపీ అధికారులు, లారీ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నిల్వలు, తరలింపు ప్రక్రియ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రైతులు తమ పంటను విక్రయించిన అనంతరం ఎలాంటి ఆలస్యం లేకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కొనుగోళ్లను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మారుజోడు రాంబాబు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ రాజేష్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నరేష్, ఐకేపీ ఏపీఎం, సీసీలు ఎల్లాస్వామి, సరోజన, లారీ కాంట్రాక్టర్లు, నాయకులు లింగాల జగదీశ్ చందర్ రెడ్డి, కోళ్ల రవి గౌడ్, నామాల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply