ఆయుష్మాన్ ఆస్పత్రి సేవలు బాగున్నాయి…

ఆయుష్మాన్ ఆస్పత్రి సేవలు బాగున్నాయి…

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా కేంద్రంలోని ఆయుష్మాన్ ఆస్పత్రి నిర్వహణ, సేవలు బాగున్నాయని మాజీ మంత్రి 20 దయాకర్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోనీ అయుష్మాన్ హాస్పిటల్‌లో బొమ్మెర గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలు మాచర్ల లక్ష్మి పక్షవాతం సమస్యతో గత ఐదు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మాచర్ల భిక్షపతి ఆమెకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయుష్మాన్ హాస్పిటల్‌ను సందర్శించి రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, రోగి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జైన రమేష్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు అయుష్మాన్ హాస్పిటల్‌లో ఉన్న మంచి వాతావరణం, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలను అభినందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ మాచర్ల భిక్షపతికి సూచిస్తూ మాచర్ల లక్ష్మి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply