అదుపు తప్పిన స్కూల్ బస్సు.. తప్పిన భారీ ప్రమాదం

పెద్దపల్లి (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఢీకొన్న ఘటనలో బస్సు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ విద్యార్థులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించార.