మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి గురు వారం గ్రామ సర్పంచ్ చీర వెంకటమ్మ వీరస్వామి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటమ్మ మాట్లాడుతూ గ్రామంలోని మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించు కోవడానికి పొదుపు కార్యక్రమాలు చేపట్టడానికి సొంత భవనం అవసరం ఉందన్నారు. మహిళల వినతి మేరకు ప్రభుత్వ నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఈ విద్యాసాగర్, ఉప సర్పంచ్ కంచ రాధిక శ్రీను, మాజీ సర్పంచ్ గంధసిరి వెంకన్న, వార్డు సభ్యులు జగన్, బుచ్చివీరం, అశోక్, కారోబార్ కందల రమేష్, రాజు, కామగోని సారయ్య, సింగని లక్ష్మయ్య, లింగాల యాదగిరి, చీర కిష్టయ్య, గోవిందు కుమార్, రాఘవేంద్ర చారీ,, విఓఏలు గంధసిరి లావణ్య, మోడెం హరిణి, మహిళా సంఘం అధ్యక్షురాలు గంధసిరి అశ్విని, చిరుత జ్యోతి, మహిళలు హసీనా, యాదమ్మా, ఉమా, రాధ, చిట్టె రమ, అరుణ, పాల్గొన్నారు.

Leave a Reply