Rajashyamala Yagam : వైభవంగా రాజశ్యామల యాగం Andhra Prabha Top News
Rajashyamala Yagam : వైభవంగా రాజశ్యామల యాగం Andhra Prabha Top News
- ఏపీ అభివృద్ధే లక్ష్యం
- మంత్రి పార్థసారథి సొంతూళ్లో వేడుక
- సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లపై ప్రత్యేక పూజలు
- రాష్ట్ర సుభిక్షం కోసం హోమాలు ని
- కారకంపాడుకు పోటెత్తిన భక్త జనం
( ఆంధ్రప్రభ, పామర్రు)
Rajashyamala Yagam : ఏపీ సుభిక్షంగా ఉండాలని కోరుతూ.. మంత్రి పార్థసారధి తన సొంత గ్రామంలో గురువారం వైభవంగా రాజశ్యామల యాగం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లపై ప్రత్యేకంగాఈ రాజశ్యామల యాగం నిర్వహించారు. సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ యాగంలో పాల్గొన్నారు.
Rajashyamala Yagam : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని మంత్రి కొలుసు పార్థసారథి సొంత గ్రామం కారకంపాడులో ఈ రాజశ్యామల యాగం జరిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని హోమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు.
ALSO READ :2026 Ap Cabinet Decisions : అభివృద్ధిపైనే ఫోకస్ Andhra Prabha Top Story
