Doctor | ఆపరేషన్ సక్సెస్..!

Doctor | ఆపరేషన్ సక్సెస్..!
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీలు
Doctor | భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : భద్రాచలంకు చెందిన 26 సంవత్సరాల ఎన్.ఠాగూర్, కొత్తగూడెంకి చెందిన వివాహిత మహిళ (Women) టి.స్రవంతి వేరువేరు సందర్భాలలో తమ కుడి మోకాలికి దెబ్బ తగిలి వైద్యం కోసం కొత్తగూడెం జనరల్ హాస్పిటల్‌లో చేరారు. వారికి ఆర్థోపెడిక్ డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించి ఇద్దరు పేషెంట్లకు ఏసిఎల్ లిగమెంట్ పూర్తిగా దెబ్బ తిన్నట్లు నిర్ధారించారు. శస్ర చికిత్స అవసరం అవుతుందని చెప్పారు. నవంబర్ ఒకటో తేదీన ఆర్థోపెడిక్ వైద్య బృందం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ నర్సింహారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్, అన స్తిటిస్ట్ డాక్టర్ రమేష్, స్టాఫ్‌నర్స్ రాజేష్, వేద బృందం అధునాతన ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ (ఆల్ ఇన్సైడ్ టెక్నిక్) ద్వారా ఏసీఎల్ లిoగమెంటు శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు.

పూర్తిగా కోలుకున్న పేషెంట్లు
ఇలాంటి అధునాతన శస్త్ర చికిత్సలు కొత్తగూడెం జనరల్ హాస్పిటల్ (Hospital) లో నిర్వహించడం, ఇందుకు పూర్తి సహకారం అందించిన కలెక్టర్ జితేష్ పాటిల్, సూపరింటెండెంట్ ఎం. రాధామోహన్, ప్రిన్సిపాల్ ఎం.శ్రీహరి రావుకు వైద్య బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
