వడదెబ్బకు యువకుడు మృతి..

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; మంచిర్యాల జిల్లా)మందమర్రికి చెందిన బండారి రాజేష్ గౌడ్ (44) వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. రాజేష్ గౌడ్ ఈ నెల 15వ తేదీ బుధవారం వడదెబ్బకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు.

అక్కడ చికిత్స పొందుతున్న రాజేష్ గౌడ్ మృతి చెందారు. మృతుడు రాజేష్ గౌడ్ మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ అల్లుడు. ఈ వార్త తెలియగానే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంగళవారం ఉదయం మందమర్రి చేరుకున్నారు. ఉపేందర్ గౌడ్ ను, రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply