ఉట్నూర్ సర్పంచ్ సహకారంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు..
ఉట్నూర్ సర్పంచ్ సహకారంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు..
ఉట్నూర్, (ఆంధ్రప్రభ) అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధి లోని దేవ నగర్ లో కాలనీ వాసులకు శుద్ధ జల నీళ్లు తాగించేందుకు ఉట్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ సహకారం తో ఆర్ పి జి ఫౌండేషన్ ద్వారా ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఏర్పాటుచేసిన ఆర్ ఓ ప్లాంట్ ను ను శనివారం హార్టికల్చర్ జిల్లా అధికారి నర్సయ్య, హెడ్ సొసైటీ వ్యవస్థాపకులు జాదవ్ శ్రీకాంత్ ప్రారంభించారు.గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉండటం తో దేవ నగర్ కాలనీ వాసులు సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ దృష్టి కి తీసుకువెళ్ళిన నెల రోజుల లోపే వారు ప్రత్యేక కృషి చేసి ఆర్పిజి ఫౌండేషన్ వాళ్ళ తో మాట్లాడి ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కి కృషి చేయడం జరిగిందని సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ తెలిపారు. నూతన వాటర్ ప్లాంట్ త్వరగా ఏర్పాటు చేసి శుద్ధ జలం కాలనీవాసులకు తాగునీరు అందించిన ఉట్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కు దేవనగర్ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ సొసైటీ సభ్యులు నాయకులు దేవా నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.

