Old woman | ఆర్టీసీ బస్సు ఢీకొని…

Old woman | ఆర్టీసీ బస్సు ఢీకొని…

  • వృద్ధురాలు మృతి
  • పరకాల బస్టాండు లోపలికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు
  • మూలమలుపు వద్ద ఘటన

Old woman | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు (Bus) ఢీకొని వృద్ధురాలు అకాల మరణంచెందారు. ములుగు మండలం పల్సబ్ పల్లి గ్రామానికి చెందిన తోట రాధమ్మ (70) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు మూలమలుపు వద్ద కాలినడకన వెళ్తున్న క్రమంలో వరంగల్ టు డిపోకు చెందిన టీఎస్ 03 యుసి 6567 నెంబర్ గల ఆర్టీసీ బస్సు పరకాల బస్టాండ్ లోపలికి వస్తున్న క్రమంలో బస్సు ఢీకొట్టడంతో ముందు టైరు కింద పడి అక్కడికక్కడే తోట రాదమ్మ మృతిచెందారు.

మృతురాలి వ‌ద్ద‌ ఉన్న ఆధార్ కార్డు (Aadhaar Card) వివరాల ప్రకారం…. ములుగు మండలం పల్సబ్ పల్లి గ్రామానికి చెందిన తోట రాధమ్మగా వివరాలు ఉన్నాయి. పోలీసులు మృతురాలి పార్ధీవ‌దేహాన్ని పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆర్టీసీ డ్రైవర్లు పట్టణంలో అతివేగంగా బస్సులు నడపడం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని స్థానికులు అంటున్నారు.