ఆపదలో తోటి మిత్రుడికి పూర్వ విద్యార్థుల అండ

ఊర్కొండ, ఆంధ్రప్రభ : ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తమ తోటి విద్యార్థికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003–2004 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశమై తమ చిన్ననాటి మిత్రుడు ఎండి ఖుర్షీద్‌కు ఆర్థిక సాయం అందించారు.

ఇటీవల బైక్‌పై వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైన ఖుర్షీద్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో, వైద్య ఖర్చుల నిమిత్తం పూర్వ విద్యార్థులు కలిసి రూ.15,500 కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న తమ మిత్రుడికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఖుర్షీద్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అరెడ్ల అశోక్ రెడ్డి, వాగుల్దాస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply