కార్యకర్తలతో కలిసి..

కార్యకర్తలతో కలిసి..
పాయకాపురం, ఆంధ్రప్రభ : వైసీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని సెంట్రల్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
వైసీపీ నాయకుడు నాగబాబు జన్మదినం సందర్భంగా 58వ డివిజన్‌లోని నవరంగ్ సర్కిల్ వద్ద గోపిరెడ్డి యూత్, జై భారత్ భక్త సమాజం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాగబాబుతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా శ్రీనివాసరెడ్డి, 58వ డివిజన్ అధ్యక్షుడు రాజారెడ్డి, వరలక్ష్మి, శోభనాచలం, వలి పాల్గొన్నారు.
