మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి: ఎన్వీఎస్ ప్రభాకర్

మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి: ఎన్వీఎస్ ప్రభాకర్

ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తిపై మీడియా సమావేశం

కాశీబుగ్గ, (ఆంధ్రప్రభ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశాభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో మోదీ కీలక పాత్ర పోషించారని, అయోధ్య అభివృద్ధి, గంగా నది పునరుజ్జీవనం, పేదల గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలులో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు.

అలాగే సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, మామునూరు విమానాశ్రయం అభివృద్ధి వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణ గర్వకారణమని అన్నారు.

సమావేశానికి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, జిల్లా మీడియా ఇన్‌చార్జి దశమంత రెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, జలగం రంజిత్, కుసుమ సతీష్, రత్నం సతీష్, మల్లాడి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.