ఘనంగా ఘంటసాలలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

ఘంటసాల, ఆంధ్రప్రభ : మహనీయులు ఎన్టీఆర్ అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘంటసాలలోని బ్యాంక్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జోహార్ ఎన్టీఆర్ అంటూ నివాళులు అర్పించారు. శ్రీకాకుళం డిసి చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, పిఏసిఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, గొర్రెపాటి వెంకట రామకృష్ణ, గుత్తికొండ వరప్రసాద్, దిరిశం బాలకోటయ్య, పరిసే చలపతి, గొర్రెపాటి సురేష్, సోలే శ్రీను, పొట్లూరి యోహాను, కిషోర్, దోనేపూడి బుజ్జి, వేమూరి రమేష్, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
