సీఎం సహాయనిధి పేదల పాలిట వరం..

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని, ప్రభుత్వం అందజేసే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం 58 మంది లబ్ధిదారులకు రూ. 25,63,245 ల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. గడిచిన 20 నెలల్లో భీమవరం నియోజక వర్గంలో ఇప్పటి వరకు 816 మందికి రూ 6,35,66,244 ల చెక్కులను అందించామన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా పేదలు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గంటా త్రిమూర్తులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply