సత్ ప్రవర్తనే నిజమైన మార్పు

డీసీపీ గుణ్ణం రామకృష్ణ.

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : సత్ ప్రవర్తనే నిజమైన మార్పు అని క్రైం డీసీపీ గుణ్ణం రామకృష్ణ అన్నారు.అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రౌడీ, కేడి,డెకాయిడ్, దొంగలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రేట్ వెస్ట్ జోన్ డిసిపి గుణ్ణం రామకృష్ణ పాల్గొని రౌడీ, కేడి,డెకాయిడ్, దొంగలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.సత్ ప్రవర్తనే నిజమైన మార్పు అని అన్నారు.ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ సిఐ చంద్రశేఖర్,సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.