నూతన కాంగ్రెస్ మండల కమిటీ నాయకులకు ఘన సన్మానం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నాయకులను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు గొల్ల వెంకటేష్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గొల్ల వెంకటేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ యూత్ కడెం మండల అధ్యక్షుడు రెంకాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు వాజిద్ ఖాన్, మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
