రేపు దేవాదుల ప్రాజెక్టుకు భట్టి, ఉత్తమ్

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు దేవాదుల ప్రాజెక్టు హెలిప్యాడ్‌కు చేరుకుని ఆఫ్‌టేక్ పాయింట్, పంపింగ్ స్టేషన్‌ను సందర్శిస్తారు. అనంతరం అధికారులతో ప్రాజెక్టు పనులు, నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు సీతమ్మసాగర్‌ను సందర్శించనున్నారు.