బి ఎల్ ఎ, రాజకీయ పార్టీల నాయకులు పూర్తిగా సహకరించాలి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఎస్ ఐ ఆర్ ప్రక్రియ విజయవంతం చేయడానికి బి ఎల్ వో లకు, బిఎల్ఎ, రాజకీయ పార్టీల నాయకులు పూర్తిగా సహకా రాన్ని అందించాలని ఉరవకొండ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మల్లికార్జునరెడ్డి సూచించారు. 149 ఉరవకొండ నియోజకవ ర్గంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఆదివారం ఉరవకొండలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం లో మొత్తం 2, 26,187 ఓటర్లకు గాను, 2, 26,187, ఈ ఎఫ్ ఫారాలు పంపిణీ చేశామన్నారు.

అట్టి వాటిని తిరిగి ఓటర్ల నుండి 1,95,713 ఫారాలను స్వీకరించామన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ( 86.53 శాతం ) జరిగిందన్నారు. 14 శాతం మిగిలి ఉందని, ఎస్ ఐ ఆర్ పూర్తి చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉందన్నారు. ఓటర్లతో ఎన్యూమరేషన్ పారాలను నింపేలా చేసి వాటిని బి ఎల్ వో లకు అందించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఉరవకొండ తహసిల్దార్ అరుణ, విడపన కల్లు తహసిల్దార్ వెంకటేశ్వర మ్మ, బెలుగుప్ప తహసిల్దార్ అనిల్ కుమార్, కూడేరు తహసిల్దార్ మోహన్ కుమార్, వజ్రకరూర్ తహసిల్దార్ జయశ్రీ, టిడిపి నాయకులు విజయభాస్కర్, సినిమా రామాంజనేయులు, మోపిడి గోవిందు, రాంబాబు, సిపిఐ నాయకులు చెన్నా రాయుడు, బిజెపి నాయకులు హరి ప్రసాద్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏసీ ఎర్రి స్వామి, ఈడిగ ప్రసాద్, గోవిందు, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ అశ్వత్థ నారాయణ తదితరులు పాల్గొన్నారు.