ఆలయంలో ఘనంగా వారాహి నవరాత్రి ఉత్సవాలు
కరీమాబాద్ (ఆంధ్రప్రభ): వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 34వ డివిజన్ శివనగర్‌లోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో గురువారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అర్చకుల ఆధ్వర్యంలో వారాహి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేక్ శర్మ మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలను ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, కార్యవర్గ సభ్యుల సహకారంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశికంటి రవికుమార్, పాశికంటి రాజేశ్వరరావు, రాంపల్లి చంద్రమౌళి, భైరీ శ్యాంసుందర్, రాజమౌళి, కస్తూరి శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
