ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ గా మవాలె దత్త..
జైనూర్, ఆంధ్రప్రభ: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ-ఎన్‌జీవో) కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైస్ చైర్మన్‌గా జైనూర్‌కు చెందిన దళిత రత్న అవార్డు గ్రహీత మొహలే దత్తను నియమించినట్లు జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తెలిపారు.
సోమవారం జైనూర్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో మొహలే దత్తకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన చేపడుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం జిల్లా కమిటీలో వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ మాట్లాడుతూ, సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జిల్లా ప్రజలకు స్వచ్ఛంద సేవలు అందించాలని సూచించారు. అలాగే అవినీతి, అక్రమాలు, అన్యాయాలను అరికడుతూ న్యాయం వైపు నిలబడాలని పేర్కొన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ (ఎన్‌జీవో) సంస్థకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు తమ వంతు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
