నూతన డీడీ అంబాజీ జాదవ్‌కు ఘన సన్మానం

జైనూర్, ఆంధ్రప్రభ: ఆసిఫాబాద్ నూతన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబాజీ జాదవ్‌ను శనివారం తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు.

తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు కేబీసీ నారాయణ ఆధ్వర్యంలో డీడీ అంబాజీ జాదవ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి, స్వీట్లు తినిపించారు.

ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘ నాయకులు డీడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డీడీ సానుకూలంగా స్పందించి నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కేబీసీ నారాయణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్ధవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవోలు చిరంజీవి, శ్రీనివాస్, ప్రభాకర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్‌చందర్, ప్రధాన కార్యదర్శి పోచం, జిల్లా ఉపాధ్యక్షుడు రవి, కార్యదర్శి మహేష్, సంఘ నాయకులు తెలంగరావు, కైలాస్, శ్రీకాంత్, వనిత, శ్రీరామ్, వాసుదేవ్, రాందాస్, జ్యోతిబాయి, దూర్పత భాయి తదితరులు పాల్గొన్నారు.