మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..?

మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..?
ఎమ్మెల్యే సామెల్ కి 21 మంది ఆశావహుల పేర్లు..!
నేడో ..రేపో ఫైనల్..!
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లోని 4 మున్సిపల్ కో ఆప్షన్ స్థానాలకు 20 మందికి పైగా ఆశావాహులు పోటీ పడుతున్నారు.ఇప్పటికే దరఖాస్తులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో గత వారం రోజులుగా ఆశావాహులు కో ఆప్షన్ పదవి దక్కించుకునేందుకు ఎమ్మెల్యే,ఎంపీ,జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను కలిసి తమకు పదవి వచ్చేలా సహకరించాలంటూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.రేపు (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు కో ఆప్షన్ స్థానాలకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు కావడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎట్టకేలకు ఎమ్మెల్యే మందుల సామెల్ బుధవారం సాయంత్రం స్థానిక గెస్ట్ హౌజ్ లో కో ఆప్షన్ ఆశావాహుల జాబితాను స్వయంగా సేకరించారు.ఈ సందర్భంగా 21 మంది ఆయా కోటాలో ఆశావాహులు తమ జాబితాను సమర్పించారు. ఈ జాబితాను మున్సిపల్ పాలకవర్గం, పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే స్వయంగా చర్చించి 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు అభ్యర్థులు కో ఆప్షన్ స్థానాలకు దరఖాస్తులు సమర్పించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో ఒక స్థానం తమకు ఇవ్వాలంటూ సీపీఐ నాయకులు ఎమ్మెల్యే ని కలిసి వారి తరపున ఒక్క అభ్యర్థి పేరు ప్రతిపాదించారు.నేడో …రేపు ఉదయం ఎమ్మెల్యే కో ఆప్షన్ అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.4 స్థానాల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు కో ఆప్షన్ పదవులు దక్కనున్నాయి.
కో ఆప్షన్ రేసు లో వీరే…?
కో ఆప్షన్ పదవుల కోసం మైనారిటీ, ప్రజాప్రతినిధుల,రిటైర్డ్ గెజిటెడ్ అధికారి కోటాలో మహ్మద్ అలీ,సమీర్,నబీ,ఖాజా, జావేద్, చాంద్, కారుపోతుల శిరీష, లెంకల సుజాత, ఎర్రబెల్లి మల్లమ్మ,పోలీనేని ఆనందమ్మ, అంబటి కవిత, జినుకల కనకయ్య, బుంగపట్ల యాకయ్య, మన్నే మల్లయ్య, అంబటి విజయ్ కుమార్, బొల్లెపల్లి వెంకటయ్య,ఎడ్ల శ్రీనివాస్,అవిశెట్టి స్వామి,మన్నే అంజయ్య,చేతరాశి అంజయ్య ,అన్నెపు వెంకట్ (సీపీఐ) లు రేసులో ఉన్నారు.
