సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మోత్కూర్, ఆంధ్రప్రభ: ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభ మోత్కూర్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎండీ ఇమ్రాన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గౌరవంతల శ్రీనివాస్ (భువనగిరి), జిల్లా అధ్యక్షుడిగా పల్లె శ్రీనివాస్ (ఆలేరు), ఉపాధ్యక్షుడిగా జంగ నరసయ్య (మోత్కూర్), జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాపగళ్ల శంకరయ్య (చౌటుప్పల్), సహాయ కార్యదర్శిగా పురుగుల రవి (మోత్కూర్), కోశాధికారిగా గొర్రె శంకరయ్య (రామన్నపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ, జిల్లాలోని సివిల్ సప్లై హమాలీ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ బోర్డు ఏర్పాటు, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రతా పథకాల అమలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

తమ ఎన్నికకు సహకరించిన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు బోలగాని సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

మహాసభలో పాల్గొన్న ప్రతినిధులు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.