Nayanatara | మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పిందా..?

Nayanatara | మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పిందా..?
Nayanatara | సల్మాన్ ఖాన్‌కు జంటగా నయనతార..?
జవాన్ తర్వాత బాలీవుడ్‌లో పెరిగిన క్రేజ్
లేడీ సూపర్ స్టార్ నయన్ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్
మూకుత్తి అమ్మన్ 2, టాక్సిక్ సినిమాలతో బిజీ
బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీలోనూ నయన్
Nayanatara | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అందం, అభినయం ఈ రెండు ఉన్న అతికొద్ది మంది కథానాయికల్లో ఒకరు నయనతార. ఈ అందాల తార నయనతార.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఒక్క తమిళ్ (Tamil) అనే కాదు.. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళుతుంది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా సినిమాలు చేస్తుంది. సీనియర్ హీరోల సరసన నటించేందుకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇప్పుడు మరో సీనియర్ హీరో క్రేజీ మూవీలో నటించేందుకు ఓకే చెప్పిందని టాక్. ఇంతకీ.. నయన్ ఓకే చెప్పిన ఆ క్రేజీ మూవీ ఏంటి..?

Nayanatara | సల్మాన్ కు జంటగా నయన్..
నయనతార జవాన్ మూవీలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కు జంటగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అక్కడ తన మార్కెట్ ను మరింత పెంచుకుంది. ఈ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాకుండా.. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయన్.. ఈ సినిమాని ప్రమోట్ చేయడం విశేషం. ఈ మూవీ రీజనల్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Nayanatara | లేడీ సూపర్ స్టార్..
తాజాగా మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పిందనే వార్త ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఆ సినిమా ఏంటంటే.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అని వార్తలు వస్తున్నాయి. అది కూడా సల్మాన్ తెలుగు డైరెక్టర్ తో చేసే సినిమాలో నయన్ ని తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని టాలీవుడ్ (Tollywood) టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. అధికారిక ప్రకటన రావాల్సివుంది. నయన్ కెరీర్ స్టార్ట్ చేసి సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్ అనే పేరుకి తగ్గట్టుగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతుంది.

Nayanatara | నయన్ కొత్త సినిమాలు..
ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోలకు జంటగా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తుంది. అందులో భాగంగానే మూకుత్తి అమ్మన్ సినిమాకి మూకుత్తి అమ్మన్ 2 లో నటిస్తుంది. ఈ సినిమాని సుందర్ సి డైరెక్టర్. అలాగే కేజీఎఫ్ (KGF) హీరో యశ్ నటిస్తున్న టాక్సిక్ లో నయనతార నటించింది. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. ఈ సినిమాలో యాక్షన్ అదరగొట్టిందని టాక్. అలాగే బాలయ్య, మలినేని గోపీచంద్ మూవీలో కూడా నటించేందుకు ఓకే చెప్పింది. అలాగే నిర్మాతగా మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇలా.. నయన్ వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండడం విశేషం.
