ఖాట్మండు వేదికపై పూడూరు కుర్రాడి సత్తా.. భారత్‌కు గోల్డ్ మెరుపు!

మేడ్చల్, ఆంధ్రప్రభ: నేపాల్ రాజధాని ఖాట్మాండులో నిర్వహించిన తొలి దక్షిణాసియా రాక్ బాల్ టోర్నమెంట్‌లో భారత జాతీయ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య నేపాల్ జట్టును ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత జట్టు తరఫున ఆడిన క్రీడాకారుల్లో మేడ్చల్ మండలం పూడూరు పట్టణానికి చెందిన ఇటబోయిన గోపాల్ యాదవ్ అద్భుత ప్రతిభ కనబరిచారు. తనదైన శైలిలో కీలక ప్రదర్శన చేసి జట్టు విజయానికి బలమైన మద్దతుగా నిలిచారు.

ఈ విజయంతో అంతర్జాతీయ క్రీడా వేదికపై పూడూరు యువకుడు తన సత్తా చాటి, దేశానికి గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ ప్రాంత యువ క్రీడాకారుడి ఈ ప్రదర్శన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికే గర్వకారణమని క్రీడాభిమానులు, గ్రామస్తులు కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన గోపాల్ యాదవ్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు