Nagayalanka | గ్రామ ఆరోగ్య వనం అందరికీ ఆదర్శం..

Nagayalanka | గ్రామ ఆరోగ్య వనం అందరికీ ఆదర్శం..
Nagayalanka | నాగాయలంక, ఆంధ్రప్రభ : టి.కొత్త పాలెం గ్రామంలో ఆరోగ్యవనం పేరుతో పలు రకాల ఆయుర్వేద ఔషధ మొక్కలను నాటి సంరక్షణ చేయటం ఎంతో ఆనందదాయకంగా వుండీ ఇతర పంచాయతీలకు ఆదర్శంగా వుందని జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ కొనియాడారు. సంరక్షణ కేంద్రంలోని మధునాసిని,కొండపిండి,శతావరి,నిమ్మగడ్డి,కలబంద,తులసి,ఉత్తరేణి,సరస్వతి,సదాపాకు తదితర రకాల ఆయుర్వేద మొక్కలను గ్రామంలోని చెరువులు,కాలువలు,ప్రభుత్వ పోరంబాకు భూములలో నాటగా ఏపుగా పెరుగుతున్నవాటిని బుధవారం కలెక్టరు పరిశీలించారు. ఆయుర్వేదంలో ఏ మొక్కలు ఏయే వ్యాధులను నివారిస్తుందో తెలుసుకుని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలోని డంపింగ్ యార్డు ని తొలగించి ఆ స్థానంలో ఏర్పాటుచేసిన పార్కుని ప్రారంభించారు.

అనంతరం బాలాజీ మాట్లాడుతూ సర్పంచి బండ్రెడ్డి శివపార్వతి,కార్య దర్శి ఆది అశోక్ ప్రోత్సాహం, గ్రామస్తులు గ్రామ సేవ పేరుతో తమ ఆర్థిక సహకారాలతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం స్ఫూర్తి దాయకమన్నారు.అరుదై పోతున్న ఆయుర్వేద మొక్కలను సేకరించి ఆయుర్వేద సంపద సంరక్షణ కేంద్రంగా గ్రామంలో ఏర్పాటుచేయటం గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు.వీటి గురించి నేటి తరానికి తెలియ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వీరాంజనేయ ప్రసాద్, ఎంపీడీఓ చంద్ర శేఖర్, వి ఆర్వో సాయిబాబు, డీసీ ఛైర్మన్ బండ్రెడ్డి నాగ మల్లికార్జున రావు, బండ్రెడ్డి హరి, బీసాబత్తిన ప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.


