ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలి..

ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలి..

ఎన్ హెచ్ 16 పై 6- లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం
కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి వంగూరు వరకు ఎలివేటెడ్ కారిడార్
విజయవాడ, మచిలీపట్నం సెక్షన్, డి పి ఆర్ పునరుద్ధరించాలి
ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసి అభ్యర్థన తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ ఎన్ హెచ్ 16 పై 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి బెంజ్ సర్కిల్ మీదుగా 14 కిలోమీటర్ల ఒక ఎలివేటర్ కారిడార్ను అభివృద్ధి చేయాలని విజయవాడ మచిలీపట్నం యొక్క డి పి ఆర్ ను పరిశీలించి త్వరితగతిన పనులు ప్రారంభించి నిర్మాణాలు వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబును ఎంపీ కేశినేని చిన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యమంత్రికి అభ్యర్థిస్తూ విజయవాడ బెంజ్ సర్కిల్ గన్నవరం విమానాశ్రయం మధ్య మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ కొనసాగుతున్నందున విజయవాడలోని కొన్ని ప్రధాన కూడళ్ళలో వాహనాలు రాకపోకలు తరచుగా నిలిచిపోతున్నాయి.

దీనివలన దూర ప్రాంతాలు వెళ్లే వారికి సమయం చాలా ఆలస్యం అవుతుంది. అయితే మహానాడు జంక్షన్ నుండి నిడమానూరు రైల్వే వంతెన వరకు 6-లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే ప్రాజెక్టు మంజూరు అయిందని కానీ నిర్మాణం ఇప్పటివరకు జరగడం మొదలు కాలేదని ఎంపీ చిన్ని సీఎంకు తెలియజేశారు. ఈ నిర్మాణం త్వరగా చేపడితే ట్రాఫిక్ సమస్యను చాలావరకు నియంత్రించే అవకాశం ఉంటుందని ఎంపీ తెలిపారు. మరొకవైపు కనకదుర్గ ఫ్లైఓవర్ చివరి నుండి గంగూరు వరకు సుమారుగా 14 కిలోమీటర్ల పొడవైన ఒక ఎలివేటర్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని ప్రతిపాదన తెలిపారు.

ప్రస్తుతం ఉన్న రహదారిపై రద్దీనీ తగ్గించడానికి ట్రాఫిక్ యొక్క తీవ్రతను మెరుగుపరచడానికి భద్రతను పెంచడానికి, భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలు సైతం తీర్చడానికి ఇది చాలా అవసరమని మరొకవైపు మచిలీపట్నం పోర్ట్ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న పెరిగిన రవాణా దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా ముఖ్యమైనదని ఎంపీ వివరించారు. ఇక విజయవాడ మచిలీపట్నం సెక్షన్ డిపిఆర్ ను పునరుద్ధరించాలని కూడా ఎంపీ చిన్ని ముఖ్యమంత్రికి తెలిపారు.

డిపిఆర్ ప్రస్తుతం4+000 నుండి కిలోమీటర్లు63+700 వరకు ప్రతిపాదన చేశారు. అయితే సర్కిల్, గంగూరు మధ్య ఇప్పటికే ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ దృష్ట్యా కారిడార్ యొక్క సరైన ఏకీకరణ ప్రణాళికను నిర్ధారించడానికి డిపిఆర్ పరిమితులను సవరించి కిలోమీటర్లు9+000 నుండి పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ సీఎంను కోరారు. అయితే పైన తెలిపిన అభ్యర్థనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ ఈరోజు నేషనల్ హైవే అధికారులతో జరగబోయే సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాలతో పాటు నేను అభ్యర్థించిన అంశాలను కూడా అధికారులతో చర్చించి త్వరితగతిన పనులన్నీ పూర్తయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply