ఘంటసాలలో చలివేంద్రం ప్రారంభం

ఘంటసాల, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయమని శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ యువనేత అయినపూడి భాను ప్రకాష్ పేర్కొన్నారు. ఘంటసాల గ్రామంలోని మల్లంపల్లి రోడ్డులో ఉన్న రాఫా ప్రధమ చికిత్స కేంద్రం వద్ద పర్ణశాల ప్రార్థన మందిరం వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ రానున్న కాలంలో వేసవి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం మంచి విషయం అన్నారు. గత ఏడాది కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజలు సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలిరోజు మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో షామియానా బాషా, పాస్టర్ పీ.ఎన్.రాజు, రాఫా ప్రధమ చికిత్స కేంద్రం నిర్వాహకులు కిరణ్ – సుకన్య, పర్ణశాల ప్రార్థన మందిర విశ్వాసులు రాము, నాగ మల్లేశ్వరరావు, వినయ్, బాలాజీ, వంశీ, కోటయ్య స్వామి, మోహన్, కోటేశ్వరరావు, అఖిల్, దిలీప్, ఆకాష్, ప్రశాంత్, శశి, పృథ్వి, సన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply