నాన్న క్షేమంగా ఉన్నారు – ఈషా డియోల్
నాన్న క్షేమంగా ఉన్నారు – ఈషా డియోల్
ప్రముఖ బాలీవుడ్ హీరో ధర్మేంద్ర (Dharmendra) చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆయన కుమార్తె ఈషా డియోల్ (Esha Deol) ఖండించారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయద్దు అన్నారు. ముంబాయి (Mumbai) బ్రీచ్ క్యాండీ హాస్పటల్ లో చికిత్స జరుగుతుందని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మా నాన్న క్షేమంగా ఉన్నారు. మేం ప్రైవసీని కోరుకుంటున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు అని ఈషా డియోల్ తెలియచేశారు.

