విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను స్థానిక సర్పంచ్ గడాల ప్రసాద్ చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కళావతి అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత బోధన మరియు క్రమశిక్షణతో కూడినటు వంటి ఉచిత భోజనం సౌకర్యం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ఆటల పట్ల ప్రత్యేక శిక్షణ ఎన్నో మొదలైన వసతులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటాయని తల్లిదండ్రులకు సూచించారు. ఇకనుండి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకోవాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, ఉపాధ్యాయుల బృందం పిల్లల తల్లిదండ్రులు వార్డు సభ్యులు సురేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
