నాణ్యమైన విద్యుత్ కోసం నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు.
ఊట్కూర్, (ఆంధ్రప్రభ)నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామ మూడో వార్డులో ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు నూతన విద్యుత్ స్తంభాలను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చోట కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు నరసింహ, బిజెపి నాయకులు పత్తి ఆంజనేయులు తులసీదాస్ వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
