Muthojipeta | బీఆర్ఎస్ నేత అరెస్టు…

Muthojipeta | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపోకు తీసుకెళ్లే విషయంలో కార్మికులు ఆందోళనకు దిగారు.
శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులతో కలిసి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, కార్మికులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
