ఆర్టీసీ కార్మికుల నిరసన ప్రదర్శన మనవహారం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు భారీ నిరసన ప్రదర్శన పట్టణంలో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం వేసి నిరసన చేశారు. నర్సంపేటలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడుశంకర్ గౌడ్ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు జె శ్రీనివాసులు బిఎస్ నారాయణ సిఐటియు నాయకులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడారు.

ఆర్టీసీ జీవితాలతో చెలగాటమాడవద్దని, మూడు రోజుల నుండి సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వివరిస్తున్నదని వ్యవహరిస్తున్నదని చర్చలు సఫలీకృతం కాకపోతే రాబోయే రోజుల్లో సమ్మెను ఉదృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. న్యాయమైన డిమాండ్లను గత 45 రోజుల కిందనే సమ్మె నోటీసు ఇచ్చి మూడు రోజుల క్రితం సమ్మె కార్యక్రమాన్ని చేపట్టామని అకస్మాత్తుగా చేసిన సమ్మె కాదని ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నదని విమర్శించారు.

గతంలో సమ్మె చేసిన అనుభవం ఉందని సమ్మెకు పోరాటానికి వెనుకడుగు వేసేది లేదని సమ్మెను ఉధృతం చేస్తామని రాబోయే కాలంలో సమస్య పరిష్కారమయ్యే వరకు విడతలవారీగా రోజువారీగా జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులతో పోరాట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆర్టీసీ కార్మికులు ఐక్యతగా పాల్గొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి నాయకులు, కార్మికులు, మహిళలు, పాల్గొన్నారు.

Leave a Reply