ఎలక్షన్ సర్వే ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం

గ్రామ సర్పంచి సుతారి సుమలత వినయ్ కుమార్

జన్నారంరూరల్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడలో ఎస్ఐఆర్ ఎలక్షన్ సర్వేను 100శాతం పూర్తి చేసి,ఫైనల్ లిస్టు తయారు చేసినట్లు గ్రామ సర్పంచి సుతారి సుమలత వినయ్ కుమార్ తెలిపారు. గ్రామపంచాయతి కార్యాలయం ఆవరణలో గురువారం సాయంత్రం ఎస్ఐఆర్ ఎలక్షన్ సర్వే ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు.గ్రామ ప్రజలు తమ ఓటర్ లిస్ట్ సరిచూసుకోవాలన్నారు.

పేరు చేర్పులు, మార్పులు, ఇతర సవరణలు,సమస్యలు ఏవైనా ఉంటే ఈ నెల 10వ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు గ్రామ ఇన్చార్జి, జీపీఓ సంతోషిమాతను, బీఎల్ఓ లను శాలువాలు కప్పి ఆమె సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం,నాయకులు ఆరె శీరిష్ కుమార్,ఉప సర్పంచి అసంపెల్లి కావ్య అనిల్, గ్రామ కార్యదర్శి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.