పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి…
ఎంఈవో – 2కి స్వీపర్స్, నైట్ వాచ్ మెన్ల వినతి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ స్వీపర్స్ కు నాలుగు నెలలు, నైట్ వాచ్ మెన్లకు ఎనిమిది నెలల జీతాలు తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఎంఈవో – 2 ఎం.వీరాస్వామికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో నెలకు రూ.6 వేలతో నెలల తరబడి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.6 వేలతో జీవనం ఎలా సాగిస్తారో ప్రభుత్వం ఆలోచించి విద్యా శాఖ మంత్రి లోకేష్ సహృదయంతో కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి ఎం.మహేష్, ఉపాధ్యక్షురాలు కె.రాజేశ్వరి, ఇబ్రహీంపట్నం మండల స్కూల్ స్వీపర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షురాలు పి.సుజాత, కార్యదర్శి శివకుమారి, మణి, విజయ రాణి, అప్పమ్మ, దుర్గ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
