నవోదయ పాఠశాలకు ఎంపికైన వివేకానంద స్కూల్ విద్యార్థులు..

నవోదయ పాఠశాలకు ఎంపికైన వివేకానంద స్కూల్ విద్యార్థులు..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ లో గల జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపిక అయినట్టు ప్రధానఉపాధ్యాయులు కుర్మాన్పల్లె చంద్రకాంత్ తెలిపారు. ఇందులో జుక్కల్ కు చెందిన ఆదిత్య,కె.సంకీర్తన తో పాటు గుండూర్ కు చెందిన బి.ఆర్యన్,పడంపల్లి కి చెందిన డబ్ల్యూ.ఆదిత్య ఉన్నట్టు ఆయన తెలిపారు. అరవతరగతి నవోదయ ప్రవేశ పరీక్షలో తమప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుర్మాన్పల్లె చంద్రకాంత్ తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు.దీంతోపాటు గ్రామస్తులు సైతం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.చదువుల్లో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు.