సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక గ్రామసభ..

  • పాఠశాలకు బెంచీల కొనుగోలుకు రూ.12 వేల విరాళం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మెండోరా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామంలో పారిశుద్ధ్యం, వ్యాధుల నివారణ చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీవీ. విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు కూర్చోవడానికి తగినంత డెస్క్ బెంచీలు లేవని గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన పాలకవర్గం పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా రూ.12,000 చెక్కును డెస్క్ బెంచీల కొనుగోలు కోసం అందజేసింది.

సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ చేతుల మీదుగా ఉపాధ్యాయుడు ప్రశాంత్‌కు చెక్కును అందించారు. గ్రామ పాలకవర్గం సభ్యులు అడిగిన వెంటనే పాఠశాల సమస్యను పరిష్కరించినందుకు పాఠశాల తరఫున గ్రామ పాలకవర్గ సభ్యులకు ప్రత్యేకతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు బాజిరెడ్డి అభిలాష్, డాక్టర్ సంతోష్, సప్పాల సత్యనారాయణ, కొమిరి భూమేష్, మహమ్మద్ షఫీ, రామచంద్ర గౌడ్, కాంగ్రెస్ నాయకులు పల్లి శేఖర్, చాకలి గంగాధర్, తెనుగు పోషన్న, మెడికల్ సత్యం, బ్రిస్టల్ భూమన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధికి పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు అభినందించారు.