Motkur | ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే కిషోర్ జన్మదిన వేడుకలు

Motkur | ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే కిషోర్ జన్మదిన వేడుకలు

Motkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్(Ambedkar) చౌరస్తాలో బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యకుడు జంగ శ్రీను, మాజీ మార్కెట్ చైర్మెన్ లు తీపిరెడ్డి మేఘారెడ్డి, యాకుబ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, మాజీ రైతు బంధు అధ్యక్షుడు కొండ సొమ్మల్లు, డీవీఎంసీ సభ్యులు దాసరి తిరుమలేష్, జిల్లా నాయకులు మర్రి అనిల్, దబ్బేటి శైలజ, గుంటీ దేవ, కూరెళ్ళ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply