Veldanda | అనుమానస్పద మృతి..

Veldanda | అనుమానస్పద మృతి..
Veldanda, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్, కల్వకుర్తి (Kalwakurthy) నియోజకవర్గంలోని వెల్దండ (Veldanda) మండల సమీపంలోని రాచూర్ గ్రామానికి చెందిన కొంగళ్ల శివ (26) ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంలో శివమై కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం వ్యవసాయ పనిముట్ల అవసరాల నిమిత్తం కల్వకుర్తికి బయలుదేరి వెళ్లాడు. రాత్రి గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎటు గాలించినా ఆచూకీ లభించలేదన్నారు.
ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంలో శివ శవమై కనిపించాడు అంటూ చుట్టు పక్కల రైతులకు తెలియడంతో వారందరూ బాధపడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వారిని హతమార్చి పొలంలో పడేసినట్టుగా అనుమాన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ (Police) సిబ్బంది దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
