Mothkur | పతంగుల అలంకరణలో పెద్దమ్మ తల్లి…

Mothkur | పతంగుల అలంకరణలో పెద్దమ్మ తల్లి…
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 18వ వార్షికోత్సవం, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పురోహితులు పారునంది లక్ష్మణ మూర్తి శర్మ అమ్మవారిని పతంగులతో ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు. రేపు భోగి పండుగను పురస్కరించుకొని పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లికి పెద్ద ఎత్తున ముదిరాజ్ లు బోనాలు సమర్పించనున్నారు. ఈ నెల 15న మకర సంక్రాంతి పురస్కరించుకొని ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున వనభోజనాలు నిర్వహించనున్నారు.
