మెడికల్ షాపుల స్వచ్ఛంద బంద్ విజయవంతం

మెడికల్ షాపుల స్వచ్ఛంద బంద్ విజయవంతం
మోత్కూర్, ఆంధ్రప్రభ: ఆల్ ఇండియా కెమిస్ట్ ,డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు బుధవారం మున్సిపల్ కేంద్రంలోని మెడికల్ దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా నిర్వహించిన బందు కాస్త విజయవంతం అయింది. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలపడంతో పాటు అనంతరం తమ డిమాండ్ల సాధన కోసం ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా కెమిస్ట్ డ్రగ్గేస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బుక్క చంద్రశేఖర్ గుప్త మాట్లాడుతూ తక్షణమే ఆన్లైన్లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని, క్వాలిఫైడ్ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా జరిగే మందుల విక్రయాలని నియంత్రించాలని , ఆన్లైన్లో మందుల విక్రయానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాల నిర్వహణతో దుకాణ యజమానులు, సిబ్బంది పనిచేస్తుండడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వ స్పందించి ఆన్లైన్లో మందుల విక్రయాన్ని నిలిపియాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మోత్కూర్ మండల కార్యదర్శి బత్తుల ఐలయ్య, కోశాధికారి ఎం యాదగిరి, కెమిస్ట్లు నవీన్ రెడ్డి, వసీం ఆక్రమ్, బుక్క శ్రీనివాస్, అజ్గర్ అలీ, శ్రవణ్ కుమార్, సాయి, బిక్షపతి ,చంద్రశేఖర్, స్వామి ,శ్రీనివాస్ ,శేఖర్ ,రమేష్, సురేష్, శ్రీపతి ,జనార్దన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
