రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన పోలీసులు
హసన్‌పర్తి (ఆంధ్రప్రభ): సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన హసన్‌పర్తి పోలీసులు వాటిని గురువారం పోలీస్ స్టేషన్‌లో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ, బాధితుల ఫిర్యాదుల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడంలో పోలీసులు మరోసారి విజయం సాధించారని తెలిపారు. స్టేషన్ సిబ్బంది చొరవతో రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అధికారికంగా అప్పగించినట్లు పేర్కొన్నారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో క్రైమ్ టీమ్ సభ్యులు ఎ. వెంకట్, తిరుపతి, సీఈఐఆర్ ఆపరేటర్లు పూర్ణచారి, సోమన్న, గీత, ప్రణవి, పోలీసు సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు.
