35 మంది రౌడీషీటర్లకు బైండోవర్..

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్స్ ను సీఐ బొల్లం రమేష్ ఆధ్వర్యంలోకిలా వరంగల్ మండల తాసిల్దార్ ఇక్బాల్ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్స్ కు ఈనెల 17న డిసిపి ధారా కవిత కౌన్సెలింగ్ నిర్వహించారు. 35 మంది రౌడీషీటర్స్ ను సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఇక్బాల్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందని సీఐ బొల్లం రమేష్ తెలిపారు. కార్యక్రమంలో మిల్స్ కాలనీ ఎస్ ఐ, శ్రవణ్ కుమార్, ఎస్సై,నరేష్, ఎస్సై మహేష్ మిల్స్ కాలనీ పోలీసులు పాల్గొన్నారు.
