సీఈఆర్ క్లబ్ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ ఘన విజయం

  • యూనియన్ ప్యానల్‌కు క్రీడాకారుల మద్దతు

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి భూపాలపల్లి ఏరియా సీఈఆర్ క్లబ్ ఎన్నికల్లో ఎస్‌సీఎంఎల్‌యూ-ఐఎన్‌టీయూసీ ప్యానల్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్యానల్‌కు చెందిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. జాయింట్ సెక్రటరీగా కాపు చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా యు. శ్రీనివాస్, మధిర కొమురయ్య, స్పోర్ట్స్ కెప్టెన్‌గా పాక శ్రీనివాస్, కల్చరల్ కెప్టెన్‌గా అడిచర్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఆర్. శ్రీకాంత్, ఎన్. చిరంజీవి, ఎం.డి. తాజుద్దీన్, జి. శ్రీనివాస్ విజయం సాధించారు.ఈ విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ఎస్‌సీఎంఎల్‌యూ-ఐఎన్‌టీయూసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలను ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్, ఏరియా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.