తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

తాడ్వాయి (ఆంధ్రప్రభ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం గొనెపల్లి గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, ఇందిరా మహిళాశక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా హంబుల్ బీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క మండల సమాఖ్య పరిధిలోని వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, హంబుల్ బీ సంస్థ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.