హైదరాబాద్ – స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒటు ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేటర్లు ,ఎక్స్ ఆఫిషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశించారు.. ఈ ఎన్నికలలో ఎవరికీ ఓటు వేయవద్దని కోరారు. పోలింగ్ రోజూ ఎవరూ ఓటు కు వెళ్లకుండా విప్ కూడా చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎవరూ ఓటు కు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎవరైనా విప్ ధిక్కరించి వోటింగ్ కు వెళితే వారిపై చర్యలు ఉంటాయన్నారు కేటీఆర్. ఓటు ఉన్న వాళ్లకు విప్ ఇవ్వాలని తలసాని, సబిత ఇంద్రారెడ్డి లను కెటిఆర్ ఆదేశించారు. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 23 వ తేదిన పోలింగ్ జరగనుంది.. ఈ ఎన్నికలలో బిజెపి తరుపున ఎన్ గౌతమ్ రావు , ఎఐఎంఐఎం తరుపున మిర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీ చేస్తున్నారు..
MLC Elections | ఓటు వేయవద్దంటూ కార్పొరేటర్లుకు బిఆర్ఎస్ విప్ జారీ …
