బెల్జియం : కోలీవుడ్ హీరో అజిత్ కు మరోసారి ప్రమాదం తప్పింది. బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్ రేస్ లో అజిత్ పాల్గొన్నారు. కానీ రేస్ లో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడుపుతున్న కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అజిత్ సురక్షితంగా తప్పించుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఇటీవలే అజిత్ కథానాయకునిగా విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.
Car Accident : హీరో అజిత్‌కు మరోసారి తప్పిన ప్రమాదం
